గుమ్మడికాయ గింజలలో విటమిన్ ఎ, ఫైబర్, ఐరన్, కాల్షియం, బి2, ఫోలేట్, బీటా-కెరోటిన్, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. అయితే వీటిని ఎక్కువగా తినడం వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆరోగ్యానికి మంచి చేసే గుమ్మడి గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల వాటిని అధికంగా తినడం వల్ల కడుపు నొప్పి, విరేచనాలు సంభవిస్తాయని నిపుణులు అంటున్నారు. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల కొంతమంది బరువు పెరిగే అవకాశం ఉంది. కొంతమందిలో అలెర్జీలు రావచ్చు. తీవ్రమైన గొంతు నొప్పి, దగ్గు వస్తుంది. గుమ్మడికాయ గింజలను తరచుగా తీసుకోవడం వల్ల కొంతమందిలో రక్తపోటు తగ్గుతుంది. కాబట్టి ఇప్పటికే తక్కువ రక్తపోటుతో బాధపడుతున్నవారు వీటిని తినకపోవడమే మంచిది. వీటిని చిన్న పిల్లలకు ఇవ్వకూడదు. ఈ విత్తనాలు పిల్లల గొంతులో చిక్కుకునే అవకాశం ఉంది. పెద్దలు కూడా దీన్ని సరిగ్గా నమిలి, తిని మింగాలి. గుమ్మడికాయ గింజలను సరిగ్గా తీసుకుంటేనే వాటి పూర్తి ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు అంటున్నారు. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల మంచి కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. కాబట్టి వీటిని తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. సలాడ్లు, గ్రానోలా బార్లు, స్మూతీస్ వంటి ఆహారాల్లో గుమ్మడికాయ గింజలను తీసుకోవచ్చు. వీటిని తేలికగా వేయించి కూడా తీసుకోవచ్చు.
గుమ్మడికాయ గింజలు - అనర్ధాలు
June 03, 2025
0
Tags