వడిశలేరు వద్ద లారీని ఢీకొన్న కారు : ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి గాయాలు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా వడిశలేరు వద్ద లారీని అతివేగంతో వచ్చిన కారు ఢీకొని బావా బావమరుదుల కుటుంబంలో ఐదుగురు అక్కడి కక్కడే మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. రాజానగరం మండలం దివాన్‌చెరువు పరిధిలోని రఘునాథపురం గ్రామానికి చెందిన రేలంగి శివన్నారాయణ, రాజమండ్రి రూరల్‌ మం డలం పిడింగొయ్యి పంచాయతీ పరిధిలోని కవలగొయ్యికు చెందిన తీగిరెడ్డి శివ బావా బామ్మర్దులు.ఎక్కడికెళ్లినా కలిసేవెళతారు. ఇద్దరూ సరదాగా ఉంటారు. రేలంగి శివన్నారా యణకు కవల పిల్లలు వర్షిత, హర్షిత. వీరికి 13 సంవత్సరాలు. వీరి ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవడం కోసం గత కొద్దిరోజులుగా కాకినాడ కలెక్టరేట్‌కు వెళ్లి వస్తున్నారు. దీనిలో భాగంగానే సోమవారం పీజీఆర్‌ఎస్‌ ఉండడంతో ఉదయం 9గంటల ప్రాంతంలో ఎస్‌యూవీ జైలో కారులో రేలంగి శివన్నారాయణ (40), ఆయన సతీమణి రేలంగి దేవి లలిత (34), వారి కవల పిల్లలు వర్షిత (13), హర్షిత (13), ఆయన బావమరిది తీగిరెడ్డి శివ (30) ,ఆయన సతీమణి తీగిరెడ్డి భవాని (26), కుమార్తె తీగిరెడ్డి సాన్వి (4) కలిసి సోమవారం కారులో కాకినాడ వెళ్లారు. కాకి నాడలో పని చూసుకొని బీచ్‌కి వెళ్లి సరదాగా గడిపారు. భోజనం అనంతరం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తిరుగు పయనమయ్యారు. 20 నిమిషాల్లో ఇంటికి చేరిపోతారనగా రెండు కుటుంబాలు రెప్పపాటులో ఛిద్రమైపోయాయి. వీరిలో ఐదుగురు మృతిచెందగా హర్షిత, భవాని ఒక ప్రైవేట్‌ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రియల్‌ ఎస్టేట్‌, ఫైనాన్స్‌ తదితర వ్యాపా రాలు చేస్తున్న శివన్నారాయణ ఓన్‌ డ్రైవింగ్‌ విధానంలో కారును స్నేహితుడి నుంచి ఎప్పటి మాదిరిగానే కిరాయికి తీసుకున్నాడు. కారును బావమరిది శివ నడుపుతున్నాడు. ఏడీబీ రోడ్డు లోని వడిశలేరు సమీపంలోని పెట్రోల్‌ బంకు వద్ద రంగం పేటలోని ఓ డైయిరీ నుంచి పాల లోడుతో వస్తున్న ట్యాంకరు రోడ్డుపై నిలిపి ఉంది. అక్కడ రోడ్డు మరమ్మతులు చేస్తుం డడంతో డైవర్షన్‌ బారికేడ్లు పెట్టారు. ఎడమ వైపున లారీ ఆగి ఉంది. అక్కడికి వచ్చాక కారును కుడి వైపునకు మళ్లించాల్సి ఉంది. అయితే కారు వేగంగా వస్తుండడంతో మలుపు తిప్పే సమయంలో కుడి వైపునకు తిరగకుండా నేరుగా ఎదురుగా ఉన్న పాల ట్యాంకరులోకి దూసుకుపోయింది. దీంతో ముందు సీట్లో కూర్చున్న శివన్నారాయణ, శివ, మధ్య సీట్లోని వర్షిత, లలిత, శాన్వి అక్కడికక్కడే మృ తి చెందారు. వెనుక సింగిల్‌ సీట్లలో కూర్చున్న భవానీ, హర్షిత తీవ్రంగా గాయపడగా ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందున్నారు. ఏడీబీ రోడ్డులో సుమారు ఆరేళ్లుగా మరమ్మతులు చేస్తూనే ఉ న్నారు. దీంతో ఎక్కడపడితే అక్కడ బారికేడ్లు, డైవర్షన్లు ఉండడంతో అయోమయం ఏర్పడి ప్ర మాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని స్థాని కులు చెబుతున్నారు.ఆస్పత్రి వద్దకు మంత్రి కందుల దుర్గేష్‌ చేరుకొని బాధిత కుటుం బా లను ఓదార్చారు. రెండు కుటుంబాల్లో విషాదం కలచివేస్తోందన్నారు.మృతుల్లో కొందరికి జన సేన సభ్యత్వం ఉందని చెబుతున్నారని,ఆ మేర కు ఆర్థిక సహాయం అందించడానికి ప్రయ త్ని స్తామన్నారు.బాధితులను రాజానగరం ఎమ్మెల్యే బలరామకృష్ణ సతీమణి వెంకటలక్ష్మి పరామ ర్శించి ధైర్యం చెప్పారు.అడిషనల్‌ ఎస్పీ మురళీ కృష్ణ,డీఎస్పీలు దివ్య, రమేష్‌ బాబు, సీఐ అప్పా రావు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.పాలవ్యాన్‌ డ్రైవర్‌ పరారీలో ఉన్నా డు.ప్రమాదంపై రంగంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 






Post a Comment

0Comments

Post a Comment (0)