తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ముందే జాగృతి పార్టీ ఆఫీస్ ని కొత్తగా ఓపెన్ చేసిన ఎంఎల్సీ కవిత తాజాగా రాష్ట్ర అవతరణ వేడుకలలో పాల్గొంది. ఇందులో కవిత వేసుకున్న కండువా కూడా మార్చుకుంది. అంతకుముందు గులాబీ రంగు కండువా ధరించిన కవిత తాజాగా గులాబీ రంగు కండువాను ధరించకుండా జాగృతి అని ఉన్న కండువాని మెడలో వేసుకుంది. అలాగే ఆ కండువా పై కేసీఆర్ ఫోటో కూడా లేదు. దీంతో కవిత కొత్త పార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. అలాగే ఈ రాష్ట్ర అవతరణ వేడుకల్లో కవిత జై తెలంగాణ.. జై జాగృతి.. జై కేసీఆర్..అని చెప్పింది కానీ జై బీఆర్ఎస్ అని ఒక్కసారి కూడా తన నోటి నుండి పలకలేదు. దీంతో డౌటే లేదు కవిత వేరే పార్టీ పెట్టడానికి ముహూర్తం కూడా చూసుకుంటుంది అంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర అవతరణ రోజు కవిత చేసిన పని రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది.మరి ఇంకా కవిత ముందు ముందు ఏం చేస్తుంది. ఆమె కొత్తదారి ఎంచుకుంటుందా లేక తండ్రి మాటకు విలువిచ్చి బీఆర్ఎస్ లోనే కొనసాగుతుందా అనేది చూడాలి.
కండువా మార్చిన ఎంఎల్సీ కవిత ?
June 03, 2025
0
Tags