లసోడా పండు - ఆరోగ్య ప్రయోజనాలు

Telugu Lo Computer
0


సోడా పండును సెల్వత్ అని కూడా పిలుస్తారు. ఆన్ లైన్ లో ఈ పండుతో చేసిన పచ్చడి లభిస్తుంది. ఈ పండు చాలా అరుదుగా దొరుకుతుంది. ఈ పండు ఎక్కువగా మధ్యప్రదేశ్ లోని బాలఘాట్ ప్రాంతంలో కనిపింస్తుంది. దీనిలో ప్రత్యేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. దీనికి అతుక్కునే లక్షణం ఉండడంతో,దీన్ని నుంచి గమ్ము కూడా తయారుచేస్తారు. ఈ లసోడా పండులో ఆక్సిడెంట్లు విటమిన్లు, ఖనిజాలు, పుష్కలంగా ఉంటాయి. ఈ పండు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందించడమే కాక ఆస్తమా, కీల నొప్పులు తెప్పించే ఆర్థరైటిస్ వంటి వ్యాధులకు చికిత్సగా ఉపయోగపడుతుంది. ఈ సెల్వతు చెట్టు సాధారణంగా బాలఘాట్ లోని గ్రామాలలో కనిపిస్తుంది. ఈ చెట్ల సంఖ్య వేగంగా తగ్గిపోతుంది. కాబట్టి, పండ్లు మరింత అరుదైనవిగా మారుతున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)