తెలంగాణ ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య ఇంట్లో వ్యక్తి ఆత్మహత్య

Telugu Lo Computer
0


తెలంగాణ లోని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య ఇంట్లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని ఎమ్మెల్యే ఇంట్లో వ్యక్తిగత పనులు చేసే గందమల్ల రవి(38)గా గుర్తించారు. అతడు మూడో అంతస్తులో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రవి ఎమ్మెల్యే ఇంట్లో పనిచేస్తూ పైఅంతస్తులో నివాసం ఉంటున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)