ఆన్లైన్ ఫుడ్ ర్యాంకింగ్ ప్లాట్‌ఫామ్ టేస్ట్ అట్లాస్ చల్లటి హిమక్రీమ్‌ల జాబితాను కూడా విడుదల చేసింది. వాటిలో భారత్‌కి చెందిన ఐదు ప్రముఖ బ్రాండ్‌ల ఐస్‌క్రీమ్‌లు చోటు దక్కించుకోవడం విశేషం. మెత్తం వంద ది బెస్ట్ ఐస్‌క్రీమ్‌ల జాబితాను వెల్లడించగా అందులో ఐదు భారతీయ ఐస్‌క్రీమ్‌లకు స్థానం లభించింది. ముంబైకి చెందిన కె. రుస్టమ్స్ & కో. బ్రాండ్‌కి చెందిన మ్యాంగో శాండ్‌విచ్ ఐస్‌క్రీమ్ వాటిలో ముందుంజలో ఉన్నది. దీన్ని సన్నని వేఫర్‌లలో ప్రత్యేకమై ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్‌లకు గమ్యస్థానంగా నిలిచింది. ఇది అత్యతం పురాత ఐస్‌క్రీమ్ దుకాణం. దీన్ని దాదాపు 1950లలో స్థాపించారు. అప్పటి నుంచి విభిన్న రుచుల ఐస్‌క్రీమ్‌లతో వినియోగదారులను అలరిస్తూనే ఉంది. ఈ మామిడి శాండ్‌విచ్ టేస్ట్ అట్లాస్ గుర్తింపుతో మరింత ప్రజాదరణను పొందనున్నది. రెండో స్థానంలో పబ్బాస్, మంగళూరు గడ్బాద్ ఐస్‌క్రీమ్ ఉంది. ఇది సాంప్రదాయ ఐస్ క్రీం రుచులకు ప్రసిద్ధి చెందింది. దీనిలో జెల్లీలు, పండ్లు మిళితం చేసిన గడ్బాద్ ఐస్ క్రీమ్ ఇది. దీన్ని స్థానికులు, పర్యాటకులు అత్యంత ఇష్టంగా తింటారట. మూడవ స్థానంలో సహజసిద్ధమైన కొబ్బరితో చేసిన ఐస్ క్రీం. 1984లో స్థాపించబడిన బ్రాండ్ దీన్ని తయారు చేసింది. ఇప్పటి దీని ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. నాల్గవ స్థానంలో అప్సరస్ జామ ఐస్ క్రీం దక్కించుకుంది. ఇది కూడా ముంబైలో స్థాపించబడిన బ్రాండ్. టేస్టీ అట్లాస్ కూడా ఈ జామా ఐస్‌క్రీం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇందులో జామ ముక్కల తోపాటు మసాల దినుసులతో ఉన్న ఐస్‌క్రీమ్. చివరి స్థానంలో కార్నర్ హౌస్, బెంగళూరు డెత్ బై చాక్లెట్ అని పిలిచే సిగ్నేచర్ ఐస్ క్రీమ్ ఉంది.
టేస్ట్ అట్లాస్ బెస్ట్ ఐస్ క్రీమ్‌ల జాబితాలో చోటు దక్కించుకున్న ఐదు భారతీయ బ్రాండ్‌లు
June 27, 2025
0
Tags