టీడీపీ నేత ఇంట్లో 960 గ్రాముల బంగారం, 5 కిలోల వెండి, రూ. 2 లక్షల నగదు చోరీ

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం ఆరెలో టీడీపీ నేత ప్రకాష్‌రావు ఇంట్లో చోరీ జరిగింది. ప్రకాష్‌రావు దంపతులు షిర్డీ వెళ్లిన సమయంలో ఈ చోరీ జరిగింది. వారి కుమారుడు, కోడలు లండన్‌లో ఉంటారు. ప్రకాష్‌రావు కోడలి చెల్లెలి పెళ్లి కోసం నెల కిందట వాళ్ళు ఊరికి వచ్చారు. పెళ్లి కోసం చెన్నైలోని బ్యాంకు లాకర్ నుంచి బంగారు నగలు తెచ్చారు. పెళ్లి అయ్యాక కుమారుడు, కోడలు లండన్ వెళ్ళిపోయారు. అయితే బంగారు నగలను మళ్ళీ లాకర్‌లో పెట్టాలని అనుకున్నారు.. కానీ ఆరోగ్యం బాగాలేని కారణంగా పెట్టలేకపోయారు. ప్రకాష్‌రావు, శ్రీదేవి దంపతులు షిర్డీ వెళ్లేందుకు రెండు నెలల ముందు టికెట్లు బుక్ చేసుకున్నారు.ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగలు అర్ధరాత్రి దాటాక ఇనుప గేటు తాళాలు పగలగొట్టారు. లోపలికి వెళ్ళి మెయిన్ డోర్ రాడ్‌తో తెరిచి.. ఇంట్లోకి వెళ్ళి బీరువాలు, కప్‌బోర్డుల్లోని వస్తువులు చిందర వందర చేశారు. నగలు, డబ్బులు తీసుకుని పారిపోయారు. గురువారం ఉదయం ప్రకాష్‌రావు సోదరుడు యుగంధర్‌ నాయుడు ఇంటికి వెళ్లగా.. తలుపు తెరిచి ఉండటంతో అనుమానం వచ్చింది. వెళ్లి చూస్తే దొంగతనం జరిగిందని గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్‌టీం ఆధారాలు సేకరించారు. అయితే దొంగలు దేవుడి గదిలో సాయిబాబా విగ్రహానికి వేసిన బంగారు నగను వదిలేయడంతో అందరూ అవాక్కయ్యరు. దొంగలకు దైవభక్తి ఉందని చర్చ జరిగింది. దొంగలు 960 గ్రాముల బంగారం, 5 కిలోల వెండి వస్తువులు, రూ. 2 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. చోరీ జరిగిందనే విషయం తెలియనేగా ప్రకాష్‌రావు, శ్రీదేవి దంపతులు ఊరికి చేరుకున్నారు. అయితో ఈ దొంగతనం వెనుక తెలిసిన వాళ్ల హస్తం ఉందని అనుమానం వ్యక్తమవుతున్నాయి. ఇంటి దగ్గర గ్రామస్థుల కాలిముద్రలు గుర్తించారు. ఇద్దరు లేదా ముగ్గురు దొంగతనం చేసి ఉంటారని భావిస్తున్నారు. బీరువా తాళాలు ఎక్కడ ఉంటాయో స్థానికులే చెప్పి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే ఈచోరీ జరిగిన ఇంటికి సమీపమంలో పుత్తూరుకు చెందిన ఓ బట్టల షాపు పేరుతో ఉన్న సంచి దొరికింది. అందులో రెండు దుప్పట్లు ఉండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చోరీ జరిగిన ఇంటి ఆవరణలో గుర్తించిన కాలిముద్రల ఆధారంగా ఇద్దరు, ముగ్గురు దొంగతనం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)