చేపలతో పాటు చేప గుడ్లలో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. చేప గుడ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది మన అధిక రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది. చేప గుడ్లను తింటే గుండె సంబంధిత సమస్యలు కూడా దగ్గరకు రాకుండా ఉంటాయి . గుండె సంబంధిత సమస్యలు రాకుండా మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే గొప్పగుణం చేప గుడ్లకు ఉంది చేప గుడ్లలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. చేప గుడ్లను తింటే మన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇక చేప గుడ్లను తింటే కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అంతేకాదు చేప గుడ్లను రెగ్యులర్ గా తీసుకునే వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. మహిళలకు వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా చేప గుడ్లు చేస్తాయని చెప్పవచ్చు. మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే గొప్పగుణం చేప గుడ్లకు ఉంది. ఇక చేప గుడ్లలో మెగ్నీషియం, క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ డి వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చేప గుడ్లు మన ఎముకలను బలోపేతం చేయడానికి ఎంతగానో దోహదం చేస్తాయి. చేప గుడ్లు తిన్న వారిలో దంతాల సమస్యలు రాకుండా ఉంటాయి.
చేప గుడ్లు (జన) ఆరోగ్యం ప్రయోజనాలు
May 21, 2025
0
Tags