రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ కోటి మంది ప్రజలు ఉన్న హైదరాబాద్‌కు రింగురోడ్డు ఉంది. అదే తరహాలో విశాఖలో సెమీ రింగ్‌రోడ్డు నిర్మిస్తామన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి అవుతుందని తెలిపారు. ఈ ఎయిర్‌పోర్టును అనుసంధానం చేస్తూ 22 రోడ్లు ప్రతిపాదించామని, వాటిలో 15 రోడ్లు పూర్తి అవుతున్నాయని తెలిపారు. 115 రోజుల్లో మిగిలిన ఆరు రోడ్లకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేసి, జాతీయ రహదారి సంస్థతో సమన్వయం చేసుకొని పూర్తి చేస్తామని చెప్పారు. టిడ్కో ఇళ్లు పూర్తి చేయాలంటే రూ.7వేల కోట్లు కావాలి. వైకాపా హయాంలో అప్పులు చేసి వాటిని పక్కదారి పట్టించారు. 2014-2019 మధ్య 7లక్షల టిడ్కో ఇళ్లు ప్రతిపాదించాం. అవి వైకాపా హయాంలో ఆగిపోయాయి. కేవలం రెండు లక్షల ఇళ్లు కూడా పూర్తి చేయలేకపోయారు. ఎంత ఖర్చయినా మహిళలకు టిడ్కో ఇళ్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు సంకల్పించారు. ఈ దసరాకి టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామన్నారు. ప్రతి ఇంటికి నీరిచ్చేలా 2021లో అమృత్ పథకం కోసం కేంద్రం నిధులిస్తే వైకాపా ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు. ఆ నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. సీఎం చంద్రబాబు కేంద్రంతో మాట్లాడి మళ్లీ నిధులు వచ్చేలా చేశారు. రూ. 834 కోట్ల పనులు అమృత్ పథకం కోసం నిర్దేశించాం. కొద్ది నెలల్లో అమృత్ పథకం ద్వారా సర్ఫేస్ వాటర్ వస్తాయి. విశాఖ మెట్రోకి సంబంధించి అక్టోబర్ నెలలో పనులు మొదలుపెడతాం. డబుల్ డెక్కర్ మెట్రో కింద డీపీఆర్ ఇచ్చామని మంత్రి నారాయణ అన్నారు.
విశాఖపట్నంలో సెమీ రింగ్‌రోడ్డు నిర్మిస్తాం !
May 21, 2025
0
Tags