గర్భాశయ క్యాన్సర్ - లక్షణాలు !

Telugu Lo Computer
0


డవారిలో గర్భాశయ క్యాన్సర్ 33-45 వయస్సున్నవారిలో వస్తుంది. దీనివల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సర్వైకల్‌ క్యాన్సర్ (గర్భాశయ క్యాన్సర్) గర్భాశయానికి యోనికి కింది భాగంలో వస్తుంది. వివిధ కారణాల వల్ల సర్వైకల్‌ క్యాన్సర్ వస్తుంది. సెక్సువల్‌ ఇన్ఫెక్షన్‌ వల్ల కూడా రావచ్చు. దీనిని ముందుగానే గుర్తించాలి. 35-44 మధ్య వయస్సున్న వారికి సోకుతుంది. 15-20 ఏళ్లలో ఇది పూర్తిస్థాయిలో వృద్ధి చెందుతుంది. ముందస్తుగా సర్వైకల్‌ కేన్సర్‌కు సంబంధించిన టెస్ట్‌లు నిర్వహించుకోవాలి. ముందుగానే రాకుండా జాగ్రత్తలు తీసుకోవడమే మేలు. సాధారణంగా మానవ శరీరంలో పాపిలోమా వైరస్‌ సోకినపుడు ఇమ్యూనిటీ ద్వారా వైరస్‌ సోకకుండా ఎదుర్కొంటాయి. కొన్ని అసాధారణ పరిస్థితుల్లో ఇవి కేన్సర్‌ కార కాలుగా మారతాయి. రెగ్యూలర్‌ స్క్రీనింగ్, వ్యాక్సినేషన్‌ ద్వారా అంటే 3 ఏళ్లకు ఒకసారి పీఏపీ, హెచ్‌పీవీ డీఎన్‌ఏ పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చన్నారు. పీఏపీ టెస్ట్‌ ద్వారా కేన్సర్‌ కారకాలను సులభంగా గుర్తించవచ్చన్నారు. అలాగే ముందు స్టేజీలోనే తెలుసుకోవడం వల్ల కేన్సర్‌ను గెలవచ్చని డాక్టర్‌ సూచించారు. పిరియడ్స్‌ అధికంగా అవ్వటం. నెలసరి మధ్యలో కూడా తరచూ బ్లీడింగ్‌, యోనిలో నొప్పి కలగటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ క్యాన్సర్‌ రెండు రకాలు.. స్కామస్‌ సెల్‌ కర్సినోమా, అడెనోకర్సినోమా. స్కామస్‌ కర్సినోమా సర్వైకల్‌ కేన్సర్‌ సోకే ప్రతి 10 మంది లో 9 మంది దీని బారిన పడుతున్నారు. అరెనోకర్సినోమా గ్లాండీయర్‌ సెల్‌ లో డెవలప్‌ అవుతుంది. మొదటి స్టేజీ సర్వైకల్‌ కేన్సర్‌ కణాలు యూట్రస్‌లో వృద్ధి చెందడం. రెండో స్టేజీ.. ఈ కణాలు యోని బయట వైపుకూడా వృద్ధి చెందుతాయి. మూడో స్టేజీ.. కిడ్నీలపై వీటి ప్రభావం పడుతుంది. నాలుగో స్టేజీ..లోపలి అవయవాలపై వీటి ప్రభావం పూర్తిగా పడుతుంది. హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్‌ ద్వారా ఈ సర్వైకల్‌ కేన్సర్‌ వస్తుంది. సెక్సువల్‌గా యాక్టివ్‌గా ఉండే వ్యక్తుల్లో ఈ కేన్సర్‌ సోకుతుంది. ముందస్తు నివారణ, తరచూ పరీక్ష చేయించుకోవడం. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ వెయించుకోవడం అవసరం. పీఏపీ పరీక్ష ద్వారా అసాధారణ కేన్సర్‌ కారకాలను కనిపెట్టవచ్చు. ఎండో సర్వైకల్‌ కర్టెజ్‌ ద్వారా కెల్పొస్కోపీ చికిత్స, లేజర్‌ ట్రీట్‌మెంట్ ఇస్తారు.

Post a Comment

0Comments

Post a Comment (0)