ఏప్రిల్ 1 నుంచి బ్యాంక్ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ పాటించాలి !

Telugu Lo Computer
0


ప్రిల్ 1 నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ సహా మరికొన్ని బ్యాంకులు తమ ఖాతాదారులకు కనీస బ్యాలెన్స్ నిబంధనలను అమలు చేస్తున్నాయి. బ్యాంకులు ఈ నియమాలను ఖాతా ప్రాంతాన్ని బట్టి కనీస బ్యాలెన్స్ అవసరాలను అమలు చేస్తున్నాయి. అంటే పట్టణ ఈ ప్రాంతాలలో అధిక కనీస బ్యాలెన్స్ అవసరం. సెమీ-అర్బన్ ఈ ప్రాంతాలలో మితమైన కనీస బ్యాలెన్స్ అవసరం. గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ కనీస బ్యాలెన్స్ ఉండాలనే నిబంధనలను అమలు చేస్తారు. అంతేకాదు, నిర్దేశించిన కనీస బ్యాలెన్స్ ఖాతాలో ఉంచకపోతే జరిమానా చెల్లించాల్సి రావచ్చు. కాబట్టి, ఖాతాదారులు తమ బ్యాలెన్స్‌ను సరిగ్గా నిర్వహించడానికి ఈ నిబంధనలను పరిగణనలో తీసుకుని మినిమం బ్యాలెన్స్ మెయింటెన్ చేయాలి. బ్యాంకు ఖాతాను బట్టి ఈ మొత్తం మారుతుంది. కొన్ని బ్యాంకు ఖాతాదారులు పట్టణ ప్రాంతాల్లో రూ. 5,000, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 2,000 కనీస బ్యాలెన్స్‌ను ఉంచుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు లావాదేవీల భద్రతను పెంచడానికి, బ్యాంకులు పాజిటివ్ పే సిస్టమ్ ను విధానాన్ని కూడా అమలు చేస్తున్నాయి. ఈ పద్ధతి ద్వారా రూ. 5,000 కంటే ఎక్కువ విలువ ఉన్న చెక్కుల లావాదేవీలకు వర్తిస్తుంది. దీని ప్రకారం చెక్ నంబర్, తేదీ, చెక్ చెల్లింపుదారుని పేరు, చెక్ మొత్తం వంటి విషయాలను ప్రస్తావించాలి. చెక్కుల పేరుతో జరుగుతున్న మోసాలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 1, 2025 నుంచి చాలా కాలంగా పనిచేయకుండా ఉన్న మొబైల్ బ్యాంకుల UPI లావాదేవీలను నిలిపివేయబోతోంది. అంటే, మీ బ్యాంక్ ఖాతాకు పాత నంబర్ లింక్ చేయబడి, అది చాలా కాలం పాటు ఉపయోగించకుండా ఉంటే, ఆ UPI లావాదేవీలను కొనసాగించడానికి, ఏప్రిల్ 1, 2025 లోపు బ్యాంక్ ఖాతాకు కొత్త నంబర్‌ను లింక్ చేయాలి. లేదంటే ఆ నంబర్‌తో UPI లావాదేవీలు చేయలేరు. మోసం, ఫిషింగ్ స్కామ్‌లను నివారించడానికి గత 12 నెలలుగా ఉపయోగించని UPI IDలను NPCI నిలిపివేస్తుంది. ఈ క్రమంలో పనిచేయకుండా ఉన్న UPI IDలను తిరిగి యాక్టివేట్ చేయని వినియోగదారులు వాటిని పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)