ఉసిరి కాయ, తాని కాయ, కరక్కాయ ఈ మూడిoటిని మెత్తనిపొడి చేస్తే దాన్ని త్రిఫల చూర్ణం అంటారు. దీన్ని తగు మోతాదులో ప్రతినిత్యం వాడితే శరీరం సక్రమంగా పనిచేస్తుంది. అనేక వ్యాధుల నుండి దూరంగా ఉండొచ్చు. ఈ త్రిఫలా చూర్ణంలో యాంటి ఆక్సిడెంట్లు, యాంటి బ్యాక్టీరియా గుణాలు సమృద్దిగా ఉంటాయి. దీనితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇంగ్లీషు మందులను తట్టుకునే బ్యాక్టీరియాను తరిమి కొట్టే సామర్థ్యం ఉందని పరిశోధనల్లో తేలింది. ఈ చూర్ణాన్ని పరగడుపున లేదా రాత్రి పడుకొనేటప్పుడు గోరు వెచ్చని నీటిలో 5 గ్రాములు కలిపి తాగవచ్చు. లేక పోతే చిన్న చిన్న గోలీలు చేసి సేవించవచ్చు. ఈ త్రిఫల చూర్ణం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. ఆకలి పెరుగుతుంది. యసిడిటి, గ్యాస్ సమస్యల నివారణకు ఉపయోగపడుతుంది. ఈ చూర్ణాన్ని ప్రతిరోజు వాడటం వల్ల కళ్ళు, చర్మం, గుండె, శ్వాస సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది. ఒక వేల ఆల్రెడీ ఉంటే అదుపులో ఉంచుతుంది. రక్త హీనత ఉన్నవారిలోఎర్ర రక్త కణాలను పెంచుతుంది. జ్ఞాపక శక్తిని పెంచుతుంది. అధిక బరువుని నియంత్రిస్తుంది. చర్మ కణాలను కాపాడి క్యాన్సర్ వంటి ప్రాణాoతక వ్యాధులు రాకుండా చేస్తుంది. బిపి కంట్రోల్ చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. త్వరగా ముసలితనం రాదు. జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది.
త్రిఫల చూర్ణం - ఆరోగ్య ప్రయోజనాలు !
February 04, 2025
0
Tags