జేసీబీని ఎత్తి పడేసిన ఏనుగు : సోషల్ మీడియాలో వీడియో వైరల్

Telugu Lo Computer
0


సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే ఏనుగు శక్తి గురించి పూర్తిగా అర్థమవుతుంది. @gharkekalesh అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ బహిరంగ ప్రదేశంలో కొందరు మనుషులు జేసీబీతో పని చేయిస్తున్నారు. ఆ సమయంలో ఓ ఏనుగు అక్కడకు వచ్చింది. అది వేగంగా పరిగెత్తుకుంటూ జేసీబీ దగ్గరకు వచ్చింది. నేరుగా జేసీబీ దగ్గరకు వెళ్లి దానిని ఎత్తి పడేసింది. అంత జేసీబీ కూడా ఏనుగు ముందు నిలవలేకపోయింది. ఆ తర్వాత ఏనుగు అక్కడి నుంచి ముందుకు వెళ్లిపోయింది. జనాలు కేకలు వేస్తూ ఆ ఏనుగు వెనుక పరిగెత్తారు. ఆ ఏనుగును అక్కడి నుంచి పంపించడానికి ప్రయత్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు వేల మంది వీక్షించారు. వందల మంది లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``నేను ఏనుగుతో గొడవ పడను``, ``ఏనుగుకు అందరూ కలిసి పిచ్చి ఎక్కిస్తున్నారు``, ``ప్రశాంతమైన ఏనుగును ఇలా చూడడం చాలా బాధగా అనిపిస్తోంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)