ప్రపంచంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ !

Telugu Lo Computer
0


ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా న్యూయార్క్ నగరంలోని గ్రాండ్ సెంట్రల్ టర్మినల్ గుర్తింపు సాధించింది. కేవలం రైలు ఎక్కిదిగడం కోసమే కాకుండా, ఈ స్టేషన్ అందాలను చూడటానికి కూడా టూరిస్టులు, ప్రయాణికులు ఇక్కడికి వస్తుంటారు.  ఈ గ్రాండ్ సెంట్రల్ టర్మినల్‌ రైల్వే స్టేషన్‌ను 1903 నుంచి 1913 మధ్య నిర్మించారు. నిర్మాణం పూర్తికాకముందే 1913, ఫిబ్రవరి 2న అర్ధరాత్రి 12:01 గంటలకు దీనిని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి అప్పట్లోనే 15 వేల మందికి పైగా హాజరయ్యారు. 44 ప్లాట్‌ఫారంలతో పాటు రెండు అండర్‌గ్రౌండ్ లెవెల్స్‌లో 67 రైల్వే ట్రాక్‌లు ఇందులో ఉన్నాయి. ఈ స్టేషన్ నిర్మాణానికి పదేళ్ల కాలం పట్టిందంటే ఎంత అద్భుతంగా నిర్మించారో మీరు గెస్ చేయొచ్చు. ఇంత భారీ స్థాయిలో ఉన్నందువల్లే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. ప్రతిరోజు ఈ రైల్వే స్టేషన్‌ నుంచి 660 మెట్రో నార్త్ స్టేషన్లు రాకపోకలు సాగిస్తుంటాయి. డైలీ కనీసం 1,25,000 మంది ప్యాసింజర్లు ట్రావెల్ చేస్తుంటారు. ఇంత బిజీ, బిజీగా రైల్వే స్టేషన్ ఉండటం వల్ల ఇక్కడ పిక్ పాకెటింగ్ కూడా ఎక్కువే. ఏటా 19 వేలకు పైగా సామాన్లు చోరీ అవుతుంటాయట. ఇలా కోల్పోయిన సామగ్రి ఎవరికైనా దొరికితే అక్కడున్న లాస్ట్ అండ్ ఫౌండ్ ఆఫీసులో ఇస్తుంటారు. గొడుగులు, పర్సులు, వాచీలు, బ్యాగులు, బుక్స్ వంటి వాటిని ఈ ఆఫీసులో తిరిగి కలెక్ట్ చేసుకోవచ్చు. కేవలం అతిపెద్ద రైల్వే స్టేషన్‌గానే కాకుండా అద్భుత కట్టడంగానూ దీనికి ఎంతో పేరుంది. ఇది 48 ఎకరాల్లో విస్తరించి ఉంది. వాస్తవానికి దీనిని చూస్తే ఒక రైల్వే స్టేషన్‌లా కనిపించదు. ఇందులోకి వస్తుంటే ఒక గ్రాండ్ ప్యాలెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా అనిపిస్తుంది. కేవలం దీని బ్యూటీని చూడటం కోసమే చాలా మంది ఇక్కడికి వస్తుంటారట. ఈ స్టేషన్‌లో నాలుగు వైపులా ఉండే గోడ గడియారం కూడా ఫేమస్. దీని ముందు కూర్చుని పర్యాటకులు, ప్యాసింజర్లు ముచ్చట్లు పెట్టుకుంటారు. ఎంత బిజీగా ఉన్నా కూర్చుని మాట్లాడుకుంటే స్పష్టంగా వినిపించేలా ఈ రైల్వే స్టేషన్ గోడలు నిర్మించారట. ఇన్ని విశేషాలు ఉండటంతో ఈ రైల్వే స్టేషన్‌లో ఎన్నో హాలీవుడ్ సినిమాలను షూట్ చేశారు. అమెరికన్ ఇంగ్లిష్ సినిమాల్లో ఎక్కువగా 'మీట్ మి ఎట్ ది క్లాక్' అనే మాట తరచూ వినిపిస్తుంటుంది. ఆ గడియారం ఈ రైల్వే స్టేషన్‌లోనిదే కావడం విశేషం. అంటే, అక్కడి స్థానికులకు, విజిటర్స్‌కి ఇదొక మీటింగ్ ప్లేసులా కూడా పనికొస్తుంది. అమెరికన్ ప్రెసిడెంట్ కోసం అప్పట్లో ఇందులో ఓ సీక్రెట్ ప్లాట్‌ఫారం కూడా ఉండేదట. ఈ స్టేషన్‌లో ఉండే వాల్డార్ఫ్ అస్టోరియా హోటల్‌ని నాటి ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ డి రూజ్‌వెల్ట్ సందర్శించడానికి వచ్చినప్పుడు ఈ రహస్య ప్లాట్‌ఫారంనే వాడేవారట. అయితే, ట్రాక్ 61 అనే ప్లాట్‌ఫారంపై రెగ్యులర్ ప్యాసింజర్ సేవలకు ఇప్పటికీ అనుమతి లేకపోవడం గమనార్హం.

Post a Comment

0Comments

Post a Comment (0)