పటిక బెల్లం - ఆరోగ్య ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


టిక బెల్లంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిని ఎక్కువగా ఆయుర్వేదంలో వాడుతూ ఉంటారు. గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్ ఉన్న వారు పటిక బెల్లం చిన్న ముక్క తీసుకుని నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉంటే గొంతు నొప్పి, దగ్గు అన్ని తగ్గిపోతాయి. అలాగే పటిక బెల్లం ఒక భాగం యాలుకలు రెండు భాగాలు కలిపి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. ఈ పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి రోజులో రెండు సార్లు తీసుకుంటే దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. అల్లం రసంలో పటిక బెల్లం పొడిని కలిపి తీసుకుంటే దగ్గు., జలుబు, గొంతు ఇన్ఫెక్షన్, శరీరంలో ఉన్న కఫం మొత్తం కరిగి పోతుంది. ముక్కు దిబ్బడ నుండి ఉపశమనం కలుగుతుంది. శ్వాసకోస సమస్యలు తగ్గటమే కాకుండా సీజనల్ గా వచ్చే సమస్యల నుంచి బయట పడవచ్చు. ఒక గ్లాసు చల్లటి నీటిలో కొంచెం పటికబెల్లం పొడి వేసి బాగా కలిపి తాగితే శరీరంలో వేడి అంతా బయటికి పోయి శరీరానికి చలువ చేస్తుంది. నోటి దుర్వాసన సమస్య తో బాధపడుతున్న వారు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో పసుపు, పటిక బెల్లం పొడి, మిరియాల పొడి కలిపి రాత్రి సమయంలో తాగితే దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే నోటి దుర్వాసన కూడా తగ్గిపోతుంది.


Post a Comment

0Comments

Post a Comment (0)