భోజనానికి గంట ముందు గంట తర్వాత వరకు కాఫీ, టీలను తీసుకోవడం హానికరం !

Telugu Lo Computer
0


రోగ్యకరమైన జీవనశైలితో పాటు ఆహార సమతుల్యత ఎంతో అవసరమని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సూచించింది. భోజనం చేయడానికి గంట ముందు ఆ తర్వాత గంట వరకు కాఫీ, టీలను తీసుకోవడం హానికరమని హెచ్చరించింది. జాతీయ పోషకాహార సంస్థ  విభాగం జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. టీ, కాఫీలో కెఫీన్‌, టానిన్లు ఉంటాయి. కెఫీన్‌ కేంద్ర నాడీ వ్యవస్థపై టానిన్‌ ఆహారంలో ఉండే ఐరన్‌పై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఆహారం తీసుకునే సమయంలో దానిలో ఉండే ఐరన్‌ శాతాన్ని టానిన్‌ తగ్గిస్తుంది. హిమోగ్లోబిన్‌ అనే ప్రోటీన్‌ను తయారుచేసేందుకు ఐరన్‌ చాలా అవసరం. ఇది శరీరమంతటికీ ఆక్సిజన్‌ సరఫరాలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ పానీయాల్లో ఉండే టానిన్లు ఐరన్‌ శోషణ ప్రక్రియలో అంతరాయం కలిగించే ప్రమాదం ఉంది. అందుకే భోజనం తీసుకునేముందు ఆ తర్వాత కొంత సమయం పాటు వీటిని తీసుకోకపోవడమే మంచిదని సూచించింది. ఐరన్‌ లోపం వల్ల అలసట, నీరసం, సరిగా శ్వాస తీసుకోలేకపోవడం, తలనొప్పి, హృదయ స్పందనలో మార్పు, జుట్టు రాలడం తదితర సమస్యలతో పాటు రక్తహీనతకు దారి తీయవచ్చు. మనం తీసుకునే ఒక కప్పు కాఫీలో 80 నుంచి 120 మిల్లీ గ్రాములు.. ఇన్‌స్టంట్‌ కాఫీలో 50- 65mgల కెఫీన్‌ ఉంటుంది. అదే టీలో 30-65mg కెఫీన్ ఉంటుంది. పూర్తిగా కాఫీ, టీ మానకున్నా.. కెఫీన్‌ను దృష్టిలోపెట్టుకుని వీటిని మితంగా తీసుకోవాలని ఐసీఎమ్‌ఆర్‌ సూచించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)