తెలంగాణలో అంగన్వాడీ టీచర్‌ హత్య!

Telugu Lo Computer
0


తెలంగాణలో ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో అంగన్వాడీ ఉపాధ్యాయిని హత్యకు గురైంది. పోలీసుల కథనం ప్రకారం.. సుజాత (48) మండలంలోని కాటాపురంలో అంగన్వాడీ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆమె విధులు ముగించుకుని తన స్వగ్రామమైన ఏటూరునాగారం బయలుదేరారు. బుధవారం ఉదయం తాడ్వాయి సమీపంలో అడవికి వెళ్లిన తునికాకు కూలీలకు సుజాత మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న సీఐ శంకర్‌, ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి మెడకు స్కార్ఫ్‌ను చుట్టి ఉరి వేసినట్లు గుర్తించారు. సుజాతకు చెందిన నాలుగు తులాల బంగారం, సెల్‌ఫోన్‌ చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు. దీనిపై విచారణ చేపట్టినట్లు చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)