తాలిబన్‌ నేతను భారత్‌కు ఆహ్వానించడమే కాదు, డిన్నర్‌ కూడా ఇస్తారా? : ప్రముఖ కవి, రచయిత జావేద్‌ అక్తర్‌

Telugu Lo Computer
0


తాలిబన్‌ నేతను భారత్‌కు ఆహ్వానించడమే కాదు, డిన్నర్‌ కూడా ఇస్తారా? అవమానంతో తలదించుకున్నట్లైంది అంటూ ప్రముఖ కవి, రచయిత జావేద్‌ అక్తర్‌ మండిపడ్డారు. ఉగ్రవాదాన్ని వ్యతిరేకించే మనం, ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన తాలిబన్‌ నేతకు విందు ఇస్తారా? అంటూ ప్రశ్నించారు. అన్ని ఉగ్రవాద సంస్థలపై పోరాటం చేసే మనం, ఇలా వారిని ఆహ్వానించి ప్రత్యేక విందులు ఏర్పాటు చేయడమేంటని నిలదీశారు కాగా, ఆరు రోజుల భారత పర్యటనలో భాగంగా అమిర్‌ ఖాన్‌ ముత్తఖీ.. ఇటీవల ఢిల్లీలో అడుగుపెట్టారు. ఈ మేరకు భారత్‌ ప్రభుత్వ పెద్దల్ని కలుస్తూ తాము అఫ్గాన్‌ను ముందుకు నడిపిస్తున్న తీరును వివరించారు. అదే సమయంలో తమ దేశంలో ఉగ్రజాడలు లేకుండా చేశామని కూడా చెప్పుకొచ్చారు. భారత్‌ గడ్డపై నుంచే పాక్‌ ఉగ్రవాదాన్ని వీడాల్సిందేనని వార్నింగ్‌ ఇచ్చారు. అయితే ఇలా ముత్తఖీ హెచ్చరించిన గంటల వ్యవధిలోనే పాకిస్తాన్‌-ఆఫ్ఘనిస్తాన్ ల మధ్య పోరు రాజుకుంది. తెహ్రీక్‌-ఇ-తాలిబాన్‌ పాకిస్తాన్‌ (టీటీపీ) సంస్థ స్థావరమే లక్ష్యంగా పాకిస్తాన్‌ జరిపిన దాడులు చివరకు తాలిబాన్, పాక్‌ మధ్య పోరును మరింత ఉధృతం చేశాయి. పాకిస్తాన్‌-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో ఆదివారం సైతం ఇరు దేశాల పరస్పర దాడుల పర్వం కొనసాగింది. శత్రుదేశానికి భారీ నష్టం వాటిల్లజేశామని అటు ఆఫ్ఘనిస్తాన్, ఇటు పాకిస్తాన్‌ ప్రకటించుకున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)