ఇండిగో ఎయిర్ లైన్స్ బస్ టిక్కెట్ ధరలకే విదేశాలకు ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది. పండగలను దృష్టిలో పెట్టుకుని ఈ ఆఫర్లను ప్రకటించినట్లు సమాచారం. ఇండిగో వారం రోజుల పాటు 'గ్రాండ్ రన్‌అవే ఫెస్ట్' సేల్‌ను ప్రకటించింది. కంపెనీ సేల్ సెప్టెంబర్ 15 నుండి 21 వరకు జరుగుతుంది. ఈ సేల్ 2026 ప్రారంభంలో కస్టమర్లు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఆఫర్ కింద బుక్ చేసుకున్న టిక్కెట్లు జనవరి 7 నుండి మార్చి 31, 2026 వరకు ప్రయాణానికి చెల్లుతాయి. విమాన టిక్కెట్ ధరలు రూ.1,299 నుండి ప్రారంభమవుతాయి: ' గ్రాండ్ రన్‌అవే ఫెస్ట్ ' కింద వినియోగదారులు రూ.1,299 నుండి ప్రారంభమయ్యే వన్-వే దేశీయ ఛార్జీలను, రూ.4,599 నుండి ప్రారంభమయ్యే అంతర్జాతీయ ఛార్జీలను ఆస్వాదించవచ్చు. ఈ ఆఫర్ ఇండిగో వన్-వే బుకింగ్‌లకు మాత్రమే చెల్లుతుంది. రౌండ్-ట్రిప్ బుకింగ్‌లకు వర్తించదు. అలాగే, ఈ ఆఫర్ ఇండిగో నిర్వహించే నాన్-స్టాప్ విమానాలకు మాత్రమే చెల్లుతుందని విమానయాన అధికారులు చెబుతున్నారు. ఎంపిక చేసిన దేశీయ మార్గాల్లో స్ట్రెచ్/బిజినెస్ క్లాస్‌కు అన్నీ కలిసిన (వన్-వే) ఛార్జీలు రూ. 9,999 నుండి ప్రారంభమవుతాయి.
'గ్రాండ్ రన్‌అవే ఫెస్ట్' సేల్‌ను ప్రకటించిన ఇండిగో ఎయిర్ లైన్స్
September 16, 2025
0
Tags