పాకిస్తాన్ లో ప్రముఖ చైల్డ్ టీవీ స్టార్ ఉమర్ షా గుండెపోటుతో మృతి

Telugu Lo Computer
0


పాకిస్తాన్ లో ప్రముఖ చైల్డ్ టీవీ స్టార్ ఉమర్ షా (15) హఠాన్మరణం చెందాడు. తన సోదరుడు ఉమర్ షా గుండెపోటుతో చనిపోయినట్లుగా సోదరుడు, టిక్‌టాక్ స్టార్ అహ్మద్ షా ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియజేశాడు. అటు సోషల్ మీడియాలో ఇటు టీవీలో మంచి పేరు సంపాదిస్తున్న సమయంలో అర్థాంతరంగా ఉమర్ షా తనువు చాలించడంతో ఇండస్ట్రీ షాక్‌కు గురైంది. సోమవారం తన స్వస్థలం డేరా ఇస్మాయిల్ ఖాన్‌లో ఉమర్ షా చనిపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. గుండెపోటుతో చనిపోయినట్లు వెల్లడించింది. కుటుంబ సభ్యులు, వైద్య నివేదికల ప్రకారం.. ఉమర్ షా తీవ్ర స్థాయిలో వాంతులు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఊపిరితిత్తుల్లోకి ద్రవం చేరినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రాణాలు వదిలినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఉమర్ షా సోషల్ మీడియాలోనూ.. టీవీల్లోనూ మంచి పేరు తెచ్చుకున్నాడు. తన అన్నయ్యతో కలిసి ప్రేక్షకులను అలరిస్తూ ఉండేవాడు. ''జీతో పాకిస్థాన్'', ''షాన్-ఎం-రంజాన్'' వంటి ప్రసిద్ధ షోల్లో పాపులర్ సంపాదించడంతో ప్రతి ఒక్కరికి సుపరిచితులయ్యారు. అన్నదమ్ములిద్దరూ చక్కటి దుస్తులు ధరించి అమాయక హాస్యం పండిస్తుంటారు. ''పీచే టౌ దేఖో'' రీల్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)