బెట్టింగ్ యాప్, మనీ లాండరింగ్ కేసులో టీమిండియా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్పలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 23న వీరు ఈడీ ముందు విచారణకు హాజరుకావాలని వారికి నోటీసులు అందాయి. యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్పలు పలు బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేశారని తేలడంతో నోటీసులు అందాయి. చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్ తో కేసు ముడిపడి ఉన్నందున మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ వారి స్టేట్మెంట్లను రికార్డు చేయనుంది. ఈ సమన్లు బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించింది మాత్రమే కాదు. మనీ లాండరింగ్ కేసులో భాగంగానే యువరాజ్, ఉతప్పలను ఈడీ ప్రశ్నించనుంది. మహారాష్ట్రలో సహారా గ్రూప్‌కు చెందిన అంబీ వ్యాలీ ప్రాజెక్ట్‌లోని రూ. 300 కోట్ల విలువైన ఆస్తుల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన వ్యవహారంలో ఈడీ వీరిని విచారించనుంది. పలు నివేదికల ప్రకారం, యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్పలు అంబీ వ్యాలీలో ఆస్తులు కొనుగోలు చేశారు. ఈ కొనుగోళ్లు అంబీ వ్యాలీ గ్రూప్‌కు చెందిన ఒక పెట్టుబడి పథకంలో భాగంగా జరిగాయి. ఈ లావాదేవీలలో ఏమైనా మనీ లాండరింగ్ కార్యకలాపాలు జరిగాయా అనే విషయాన్ని ఈడీ దర్యాప్తు చేయనుంది.
యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్పలకు ఈడీ సమన్లు జారీ
September 16, 2025
0
Tags