ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వెల్లలూరులో తాడిశెట్టి కార్తీక్ (5) తన ఇంటి వద్ద ఆడుకుంటుండగా గత నెల 22న కుక్కలు అతనిపై దాడి చేశాయి దాడిలో గాయపడిన బాలుడిని పలు ఆస్పత్రులలో చూపించారు రెండు రోజుల కిందట ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కార్తీక్ ను విజయవాడలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా రేబిస్ వ్యాధి సోకినట్లుగా వైద్యులు గుర్తించారు. చికిత్స కోసం జి.ఎన్.టి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆరోగ్య పరిస్థితి విషమించి బాలుడు కన్నుమూశారు. కార్తీక్ మరణంతో తన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో రేబిస్ తో బాలుడు మృతి
September 16, 2025
0
Tags