ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు వడ్డీలేని రుణాలు : సీఎం చంద్రబాబు

Telugu Lo Computer
0


న్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు వడ్డీలేని విద్య రుణాలు అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతెలిపారు. ఈ రుణాలను కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పావలా వడ్డీ పథకంతో అనుసంధానిస్తామని చెప్పారు. అన్ని వర్గాల విద్యార్థులకు ఇది అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ పథకం కింద రుణాల మంజూరుకు ఎటువంటి భద్రత అవసరం లేదని, 14 ఏళ్ల తర్వాత తిరిగి చెల్లించే వెసులుబాటు ఉంటుందన్నారు. నైపుణ్య శిక్షణ కోర్సులకూ ఈ పథకం వర్తించనుందని పేర్కొన్నారు. విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా పావలా వడ్డీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఈ సందర్భంగా ‘ఆడబిడ్డ నిధి’ పథకాన్ని కూడా త్వరలో అమలు చేస్తామన్నారు. దీనిలో భాగంగా నెలకు రూ.1,500 చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు చెప్పారు. ఇది అమ్మాయిల చదువును ప్రోత్సహించడమే లక్ష్యంగా ఉండబోతుందని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)