ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్‌పై దాడికి దిగిన హిజ్రాలు

Telugu Lo Computer
0


త్తర ప్రదేశ్‌లోని డియోరియా రైల్వే స్టేషన్ దగ్గర అవధ్ అస్సాం ఎక్స్‌ప్రెస్ రైల్లో  ఆదివారం రాత్రి మహ్మద్ అనే ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్‌ తన సిబ్బందితో కలిసి తనిఖీలు చేస్తూ ఉన్నారు. హిజ్రాలు తమ నుంచి దౌర్జన్యంగా డబ్బులు లాక్కుంటున్నారని కొంతమంది ప్రయాణికులు వారికి ఫిర్యాదు చేశారు. ప్లాట్ ఫామ్‌పై తిరుగుతున్న హిజ్రాలను మహ్మద్ పిలిచి, దౌర్జన్యంగా డబ్బులు తీసుకోవద్దని చెప్పాడు. ఇకపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నాడు. మహ్మద్ గట్టిగా వార్నింగ్ ఇవ్వటంతో హిజ్రాల గుంపు ఆగ్రహానికి గురైంది. వెంటనే అందరూ ఒక చోట గుమిగూడారు. ప్లాట్ ఫామ్ నెంబర్ 1 దగ్గర అల్లర్లు మొదలెట్టారు. రైలు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులతో తప్పుగా ప్రవర్తించంటం మొదలెట్టారు. మహ్మద్ వెంటనే మరికొంతమంది పోలీసులతో కలిసి అక్కడికి వెళ్లాడు. వారిని చూడగానే హిజ్రాల కోపం కట్టలు తెంచుకుంది. పోలీసుల లాఠీని లాక్కుని వారిపైనే దాడికి దిగారు. మహ్మద్‌ను ప్లాట్ ఫామ్‌పై పరిగెత్తించి మరీ కొట్టారు. అంతటితో వారు ఆగకుండా ఆర్‌పీఎఫ్ ఆఫీసుపై కూడా దాడికి దిగి విధ్వంసం సృష్టించారు. విషయం తెలుసుకున్న జీఆర్‌పీ పోలీసులు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అప్పటికే హిజ్రాలు అక్కడినుంచి పారిపోయారు. దాడికి పాల్పడ్డ ఇద్దరు హిజ్రాలను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)