గల్ఫ్ అకాడమీ మూవీ అవార్డ్స్ : బెస్ట్ యాక్టర్ అల్లు అర్జున్ : గ్లోబల్ కమెడియన్‌ బ్రహ్మానందం

Telugu Lo Computer
0


గల్ఫ్ అకాడమీ మూవీ అవార్డ్స్ (గామా) 5వ ఎడిషన్‌ వేడుక ఆదివారం దుబాయ్‌లోని షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఇప్పటికే పలు అవార్డులతో పాటు నేషనల్ లెవెల్‌లోనూ మంచి గుర్తింపును అందుకున్న 'పుష్ప 2' చిత్రం గామా బెస్ట్ మూవీగా అవార్డ్ కైవసం చేసుకుంది. అలాగే ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌, బెస్ట్ హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి అవార్డులను దక్కించుకున్నారు. గామా బెస్ట్ యాక్టర్ క్రిటిక్ కేటగిరీలో తేజ సజ్జా, బెస్ట్ యాక్టర్ జ్యూరీ కేటగిరీలో 'క' చిత్రానికి గాను కిరణ్ అబ్బవరం అవార్డులను అందుకున్నారు. గ్లోబల్ కమెడియన్‌గా బ్రహ్మానందం స్పెషల్ అవార్డును అందుకోగా, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును నిర్మాత అశ్వినీదత్ అందుకున్నారు. హీరోయిన్స్ ఫరియా అబ్దుల్లా, ఊర్వశీ రౌటెల, మానస వారణాశి స్పెషల్ పర్ఫార్మెన్స్‌లతో అలరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)