మొబైల్‌ చార్జర్‌ను ప్లగ్ ఇన్ చేసి వదిలేయవచ్చా ?

Telugu Lo Computer
0


ఫోన్‌లకు ఛార్జింగ్ పెట్టి బ్యాటరీ ఫుల్‌ అయిన తర్వాత ఫోన్‌ తీసుకుంటారు. కానీ ఛార్జర్‌ను ప్లగిన్ చేసి అలాగే ఉంచుతారు. ఎనర్జీ సేవింగ్ ట్రస్ట్ ప్రకారం ఏదైనా స్విచ్ ఆన్ చేసిన ఛార్జర్ ప్లగ్ ఇన్ చేయబడినప్పుడు అది విద్యుత్తును ఉపయోగిస్తూనే ఉంటుంది. మీ ఫోన్‌ దానికి కనెక్ట్ చేయబడినా, చేయకపోయినా విద్యుత్తు ఉపయోగంలోనే ఉంటుంది. ఇది కొన్ని యూనిట్ల విద్యుత్తును వృధా చేయడమే కాకుండా క్రమంగా ఛార్జర్ జీవితకాలాన్ని తగ్గిస్తుంది. ఛార్జర్‌ను ప్లగిన్ చేసి ఉంచితే, అది విద్యుత్‌ను వినియోగిస్తూనే ఉంటుంది. దీనిని ‘స్టాండ్‌బై పవర్’ అంటారు. దీని అర్థం పరికరానికి కనెక్ట్ చేయబడినా, చేయకపోయినా ఛార్జర్ కొంత విద్యుత్‌ను వినియోగిస్తూనే ఉంటుంది. దీనివల్ల చాలా విద్యుత్ వృధా అవుతుంది. ఛార్జర్‌ను ఎక్కువసేపు ప్లగిన్ చేసి ఉంచడం వల్ల అది వేడెక్కడం, సాకెట్ కాలిపోవడం, షార్ట్ సర్క్యూట్ జరగడం వంటివి సంభవిస్తాయి. అంతేకాకుండా ప్లగ్-ఇన్ ఛార్జర్ అంతర్గత భాగాలు వేడెక్కుతూనే ఉంటాయి. ఇది దాని భాగాలను దెబ్బతీస్తుంది. ఇంట్లో అగ్ని ప్రమాదాలు జరగడానికి కూడా కారణం అవుతుంది. కొన్నిసార్లు వోల్టేజ్ పెరుగుదల కారణంగా ఛార్జర్ కూడా పేలిపోవచ్చు. అందువల్ల మొబైల్‌ను ఛార్జ్ చేసిన తర్వాత, ఛార్జర్‌ను ఛార్జింగ్ పాయింట్ నుంచి తీసివేయడం మంచిది.


Post a Comment

0Comments

Post a Comment (0)