ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకల కోసం దేశంలోనే అరుదైన సొరంగం అందుబాటులోకి వచ్చింది. దక్షిణాదిలో తొలిసారిగా 7.5 కిలోమీటర్ల పొడవైన రైల్వే సొరంగాన్ని నిర్మించారు. ఈ సొరంగం నెల్లూరు, అన్నమయ్య జిల్లాల సరిహద్దుల్లో విస్తరించి ఉంది. సరుకు రవాణా చేసే రైళ్ల రాకపోకల కోసం ఓబులవారిపల్లె నుండి కృష్ణపట్నం వరకు 113 కిలోమీటర్ల రైల్వే లైన్ భారతీయ రైల్వే నిర్మించింది దీనికోసం 2000 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఇందులో భాగంగానే చిట్వేలి రాపూర్ మండలాలలోని అడవుల్లో చెర్లోపల్లి వద్ద 7.5 కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని రైల్వే శాఖ నిర్మాణం చేసింది. ఈ మార్గంలో ఈ సొరంగాన్ని నిర్మించడానికి 470 కోట్ల రూపాయలను రైల్వే ఖర్చు చేసింది. రోడ్లు చెరువులు కుంటలు, వంకలు దాటడానికి 120 చిన్న వంతెనలను 15 పెద్ద వంతెనలను కూడా నిర్మించింది. 2019 సెప్టెంబర్ 1న అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ రైలు మార్గాన్ని జాతికి అంకితం చేశారు. ప్రస్తుతం కృష్ణపట్నం ఓబులవారిపల్లె రైల్వే లైన్ లో డీజిల్ ఇంజన్లతో నడిచే గూడ్స్ రైళ్ళు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే సరుకు రవాణా రైళ్లతో పాటు ప్యాసింజర్ రైళ్లను కూడా నడపాలని రైల్వే భావిస్తున్న క్రమంలో అందుకు తగ్గట్టు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఓబులవారిపల్లి నుండి కృష్ణపట్నం కు ప్యాసింజర్ రైళ్లు ?
September 22, 2025
0
Tags