కర్ణాటకకు చెందిన ఎంపీ కె.సుధాకర్ సతీమణి ఆర్థిక నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు. ఆమెను బెదిరించి రూ.14 లక్షలు దోచుకున్నారు. ముంబయి సైబర్ డిపార్ట్‌మెంట్ అధికారినంటూ చిక్కబళ్లాపూర్ ఎంపీ కె.సుధాకర్ సతీమణి ప్రీతికి ఓ వ్యక్తి కాల్ చేశాడు. సద్బత్‌ఖాన్ అనే వ్యక్తి ఆమె పత్రాలు ఉపయోగించి, క్రెడిట్ కార్డ్ పొందాడని ఆ కాలర్ పేర్కొన్నాడు. దానిద్వారా చట్టవిరుద్ధమైన లావాదేవీలు చేశాడని బెదిరించాడు. తాము సద్బత్‌ఖాన్‌ను అరెస్టు చేశామని, అతడు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో ప్రీతి పేరు చెప్పాడని నాటకమాడాడు. డాక్యుమెంట్లు ధ్రువీకరించేందుకు వీడియో కాల్ చేయాలని, లేకపోతే అన్ని ఖాతాలను నిలిపివేస్తామని బెదిరించాడు. దీనివల్ల ఎలాంటి సమస్య ఉండదని, రూ.14 లక్షలు పంపించాలని ఆ కేటుగాడు ఆమెను ఒప్పించాడు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ఆ డబ్బును మళ్లీ రీఫండ్ చేస్తామని చెప్పాడు. డబ్బు పంపగానే కాల్ కట్ అయింది. తర్వాత కానీ తాను మోసపోయినట్లు ప్రీతికి అర్థం కాలేదు. దాంతో వెంటనే ఆమె పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది. ఆగస్టు 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కర్ణాటకకు ఎంపీ కె.సుధాకర్ సతీమణి 'డిజిటల్ అరెస్ట్'
September 22, 2025
0
Tags