గుజరాత్‌ తీరంలో నౌకలో ఎగసిపడుతున్న మంటలు

Telugu Lo Computer
0


గుజరాత్‌లోని పోర్‌బందర్‌ సుభాష్‌నగర్‌ జెట్టీ వద్ద ఓ నౌకలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకొంది. జామ్‌నగర్‌ కేంద్రంగా పనిచేసే హెచ్‌ఆర్‌ఎం అండ్‌ సన్స్‌కు చెందిన నౌకలో పంచదార, బియ్యం లోడు ఉంది. ఇది సోమాలియాలోని బొసాసోకు వెళ్లాల్సిఉంది. దీనిలో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. దాదాపు మూడు ఫైరింజన్లను వీటిని అదుపు చేయడానికి ప్రయత్నించినా.. సఫలం కాలేదు. దీంతో తీరంలో మంటలు ఎగసిపడుతుండటంతో నౌకను సముద్రంలో కొంత దూరం నెట్టుకెళ్లి నిలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)