దేశంలోని ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ ప్లాటినమ్ జూబ్లీ ఆశా స్కాలర్‌షిప్ 2025-26 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థులు, అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్స్, వైద్య విద్యార్థులు, ఐఐటీ, ఐఐఎం విద్యార్థులతో పాటు విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ అందజేస్తారు. ఈ ఏడాది 23,230 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించనున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం ఎస్‌బీఐ ఫౌండేషన్ సుమారు రూ.90 కోట్లు కేటాయించినట్టు తెలియజేసింది. 2022లో ప్రారంభమైన ఈ పథకం కింద ఇప్పటి వరకు లక్షలాది మంది వెనుకబడిన విద్యార్థులు లబ్ధిపొందారు. 9వ తరగతి నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు చదివే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సాధారణ కేటగిరీకి కనీసం 75% మార్కులు లేదా 7 సీజీపీఏ అవసరం. ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకుకనీసం 67.5% మార్కులు లేదా 6.3 సీజీపీఏ ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షల నుండి రూ.6 లక్షల వరకు మించకూడదు. దరఖాస్తు చివరి తేదీ: 15 నవంబర్ 2025. ఎంపికైన విద్యార్థులకు వారు చదివే కోర్సు పూర్తయ్యే వరకు ఏటా రూ.15 వేల నుండి రూ.20 లక్షల వరకు స్కాలర్‌షిప్ అందించనున్నారు. స్కూల్, కాలేజీ స్థాయిలో చదువుతున్న వారికి అందుకు తగిన ఆర్థిక సాయం ఇస్తారు. ఐఐటీ, ఐఐఎం, మెడికల్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకు అధిక సాయం లభిస్తుంది. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా ఈ స్కాలర్‌షిప్ వర్తిస్తుంది. కాగా ఈ స్కాలర్‌షిప్ ప్రతి సంవత్సరం రీన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం విద్యార్థులు కనీస అటెండెన్స్ ప్రమాణం పాటించాలి. వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత మార్కులు సాధించాలి. ఈ ప్రమాణాలు నెరవేర్చినంత కాలం విద్యార్థులు కోర్సు పూర్తయ్యే వరకు స్కాలర్‌షిప్ పొందుతారు. అంతే కాకుండా ఆన్‌లైన్ దరఖాస్తు విధానం మాత్రమే అందుబాటులో ఉంది. దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ SBI Platinum Jubilee Asha Scholarship 2025 ను చేసక చేయవచ్చు. విద్యార్థులు దరఖాస్తు సమయంలో తమ మార్క్‌షీట్, ఆదాయ ధృవపత్రం, ఆధార్, బ్యాంక్ అకౌంట్ వివరాలు సమర్పించాలి.
ఎస్‌బీఐ ఫౌండేషన్ ప్లాటినమ్ జూబ్లీ ఆశా స్కాలర్‌షిప్ నోటిఫికేషన్ విడుదల
September 20, 2025
0
Tags