ఇజ్రాయిల్‌ దాడులలో 50 మందికి పైగా గాజా పౌరులు మృతి

Telugu Lo Computer
0


గాజాపై ఇజ్రాయిల్‌ శనివారం తెల్లవారుజామున నుంచి జరిపిన దాడుల్లో 51 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. వీరిలో 43 మంది గాజా సిటీకి చెందిన వారే మరణించడం గమనార్హం. ఆగస్టులో ఇజ్రాయిల్‌ దాడులు ప్రారంభించినప్పటి నుంచి గాజా నగర జనాభాలో దాదాపు సగం మంది పాలస్తీనియన్లు ఈ ప్రాంతం నుండి పారిపోయారని పాలస్తీనియన్‌ సివిల్‌ డిఫెన్స్‌ తెలిపింది. కాగా, అక్టోబర్‌ 2023 నుంచి ప్రారంభమైన ఇజ్రాయిల్‌ దాడుల వల్ల ఇప్పటివరకు 65,208 మంది మృతి చెందారు. 166,271 మంది గాయాలపాలయ్యారని పాలస్తీనా ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)