సింగరేణి ఉద్యోగులకు దసరా పండుగ అడ్వాన్స్

Telugu Lo Computer
0


సరా పండుగను పురస్కరించుకుని ఉద్యోగులకు పండుగ అడ్వాన్స్ చెల్లించాలని సింగరేణి సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు సింగరేణి యాజమాన్యం శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణిలో పని చేస్తున్న అర్హులైన రెగ్యూలర్ సిబ్బందికి రూ. 25 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే, తాత్కాలిక కార్మికులకు రూ. 12,500 ఇవ్వనున్నట్లు యాజమాన్యం తెలిపింది. ఈ మొత్తం డబ్బులను ఈ నెల 23వ తేదీన జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సింగరేణి గుర్తింపు సంఘం ప్రతినిధులు కలిశారు. కొత్తగూడెం ఎమ్మెల్యే, యూనియన్ గౌరవాధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సింగరేణి అంశాలపై కీలక చర్చలు జరిపారు. సింగరేణి లాభాల వాటా 35 శాతం చెల్లించాలని సీఎంను విజ్ఞప్తి చేశారు. దీనికి సీఎం కూడా సానుకూలంగా స్పందించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)