ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ పని గంటలు పెంపు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎనిమిది పని గంటల సమయాన్ని 10 గంటలకు పెంచింది. ఇది షాపులు, కంపెనీలు, ఫ్యాక్టరీల్లో రోజువారీ పనులు చేసే వారికి వర్తిస్తుంది. పని గంటలు పెంచే సవరణ బిల్లుపై ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదం తెలిపింది. దీంతో ప్రస్తుతం ఉన్న ఎనిమిది గంటల 10 గంటలకు పెంచారు. అయితే, వారానికి 48 గంటలు సమయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. ఇక ఫ్యాక్టరీలో బ్రేక్ టైం తో కలిపి 12 గంటలు మించకూడదు. ప్రతి ఆరు గంటలకు రెస్ట్ ఇవ్వాలి. మహిళలు నైట్ షిఫ్టు రాత్రి 7, రాత్రి 8 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు వారి అనుమతి తప్పనిసరి. అంతేకాదు సంస్థ వారికి ట్రావెల్స్, సదుపాయం సెక్యూరిటీ కూడా కల్పించాల్సి ఉంటుంది. ఈ పని గంటల పెంపు సవరణ బిల్లును కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ శాసనసభల ప్రవేశపెట్టారు. ఇది వరకు మూడు నెలలకు 75 గంటల ఓవర్ టైం చేసేందుకు అనుమతి ఉంది. ఇప్పుడు దాని 164 గంటలకు పెంచారు. దీంతో ఓవర్ టైం పరిమితి కూడా పెంచినట్లు సమాచారం. మహిళలు రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పనిచేసేందుకు అనుమతి లభిస్తుంది కానీ భద్రతా, రవాణా విషయంలో అయితే తప్పనిసరి. మహిళల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. ప్రధానంగా వారికి ఇంటి నుంచి పనికి ప్రత్యేక రవాణా సౌకర్యం కూడా కల్పించాలి. 

Post a Comment

0Comments

Post a Comment (0)