విదేశీ ఉద్యోగులందరినీ ఎట్టిపరిస్థితుల్లోనూ ఆదివారం నాటికి అమెరికాకు తిరిగి రావాలని మైక్రోసాఫ్ట్ ఆదేశించింది. భారత్ సహా అమెరికా బయటి దేశాల్లో పని చేసే టాప్ టు బాటమ్ ఉద్యోగలందరికీ ఈ మేరకు ఇంటర్నల్ ఇమెయిల్స్ పంపించింది. హెచ్1బీ వీసాలపై ప్రకటన వెలువడిన రెండు గంటల్లోనే మైక్రోసాఫ్ట్ ఈ ఇమెయిల్స్ పంపించింది. ఆదివారం నాటికి హెచ్-1బీ, హెచ్-4 వీసా ఉద్యోగులందరూ కూడా అమెరికాకు తిరిగి రావాలని మైక్రోసాఫ్ట్ సూచించినట్లు రాయిటర్స్ వెల్లడించింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న తమ హెచ్-1బీ వీసా ఉద్యోగులు సమీప భవిష్యత్తులో కూడా ఇక్కడే ఉండి పనిచేయాలని కూడా సూచించింది. అమెరికన్లు ఎవరూ కూడా విదేశాల్లోని తమ కార్యాలయాల ద్వారా పని చేసే అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్. అటువంటి కంపెనీ కూడా డొనాల్డ్ ట్రంప్ విధించిన హెచ్ 1బీ విసాల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తోందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్‌తో పాటు జేపీ మోర్గాన్ కూడా బయటి దేశాల్లో పని చేస్తోన్నహెచ్-1బీ వీసాదారులను ఆదివారం నాటికి తిరిగి రావాలని సూచించినట్లు రాయిటర్స్ తెలిపింది. విసా వార్షిక ఫీజు పెంపుపై టెక్ కంపెనీలు ఇప్పటివరకు పెద్దగా స్పందించలేదు. అమెజాన్, ఆపిల్, గూగుల్, మెటా వంటి అతిపెద్ద అమెరికన్ టెక్ కంపెనీలకు విదేశాల్లో కూడా వేలాదిమంది ఉద్యోగులు ఉన్నారు. వారందరూ కూడా వెనక్కి వెళ్లాల్సి రావొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.
ఆదివారం నాటికి అమెరికాకు తిరిగి రావాలని ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ ఆదేశం
September 20, 2025
0
Tags