ఫిడే గ్రాండ్ స్విస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్ మాస్టర్ వైశాలి రమేష్‌బాబు చరిత్ర సృష్టించారు. ఆమె తన చివరి గేమ్‌ను మాజీ మహిళల ప్రపంచ ఛాంపియన్ టాన్ ఝోంగ్ యీతో డ్రా చేసుకుని వరుసగా రెండోసారి ఈ టైటిల్‌ను గెలుచుకున్నారు. ఈ టోర్నమెంట్‌ను రెండు సార్లు గెలుచుకున్న మొదటి క్రీడాకారిణి ఆమెనే కావడం గమనార్హం. ఈ విజయంతో వైశాలి క్యాండిడేట్స్ టోర్నమెంట్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్ తర్వాత క్యాండిడేట్స్ టోర్నమెంట్ కు అర్హత సాధించిన మూడో భారత మహిళా క్రీడాకారిణిగా ఆమె నిలిచారు. ఈ అద్భుత విజయం సాధించిన వైశాలికి భారత ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో మోడీ ఇలా రాసుకొచ్చారు. "అద్భుతమైన ఘనత. రమేష్‌బాబు వైశాలికి అభినందనలు. ఆమె పట్టుదల, అంకితభావం ఆదర్శనీయం. ఆమె భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు." అని ప్రధాని మోడీ రాశారు.
వరుసగా రెండోసారి ఫిడే గ్రాండ్ స్విస్ టైటిల్ గెలిచిన భారత గ్రాండ్ మాస్టర్ వైశాలి రమేష్‌బాబు
September 16, 2025
0
Tags