న్యూయార్క్ టైమ్స్‌పై 15 బిలియన్ డాలర్ల పరువు నష్టం దావా వేసిన డొనాల్డ్ ట్రంప్

Telugu Lo Computer
0


నపై ఉద్దేశపూర్వకంగా అబద్ధపు కథనాలు ప్రచురించిందని ఆరోపిస్తూ, ప్రముఖ మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్‌పై ఏకంగా 15 బిలియన్ డాలర్ల పరువు నష్టం దావాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేశారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్రూత్ సోషల్‌ వేదికగా వెల్లడించారు. దీంతో ఈ వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు ఫ్లోరిడా రాష్ట్ర కోర్టులో ట్రంప్ ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. న్యూయార్క్ టైమ్స్ ఇప్పుడు "రాడికల్ లెఫ్ట్ డెమొక్రాటిక్ పార్టీకి అధికారిక గొంతుక"గా మారిపోయిందని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. తనపై, తన కుటుంబం, వ్యాపారాలు, అలాగే 'అమెరికా ఫస్ట్', 'మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్' ఉద్యమాలపై ఆ పత్రిక నిరంతరం అబద్ధపు కథనాలు రాసిందని ఆరోపించారు. కాగా అధ్యక్ష ఎన్నికల ముందు డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతుగా న్యూయార్క్ టైమ్స్ తన మొదటి పేజీలో ప్రచురించిన కథనాన్ని ట్రంప్ తప్పుబట్టారు. దీన్ని "చరిత్రలోనే అతిపెద్ద చట్టవిరుద్ధమైన ప్రచార సహకారం"గా ఆయన పేర్కొన్నారు. తన పరువు తీయడానికి న్యూయార్క్ టైమ్స్ ఎప్పటినుంచో అబద్ధాలు రాస్తూనే ఉంది. ఇకపై అది ఆగుతుంది" అని హెచ్చరించారు. ఇదే తరహాలో, గతంలో ఏబీసీ, సీబీఎస్ వంటి నెట్‌వర్క్‌లపై దావాలు వేసి రికార్డు స్థాయిలో పరిహారం సాధించిన విషయాన్ని ట్రంప్ గుర్తుచేశారు. ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్‌పై కూడా చట్టపరంగా చర్య తీసుకుని, ఒకప్పుడు గౌరవంగా ఉన్న ఆ పత్రిక అసలు ముఖాన్ని అమెరికా ప్రజల ముందు చూపిస్తానని ఆయన స్పష్టం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)