తిరుమలలో వైభవంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Telugu Lo Computer
0


తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని  ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా ఆలయ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ నిర్వహించామన్నారు. ఏడాదిలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని.. ఆలయం అంతటా పవిత్ర సుగంధ ద్రవ్యాలతో శుద్ది కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ముందస్తు ప్రణాళికతో అధికార యంత్రాంగం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు చేశామని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)