ఢిల్లీ లోని పలు పాఠశాలలకు శనివారం ఉదయం బాంబు బెదిరింపులు వచ్చాయి. ద్వారకా నగర్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, కష్ణ మోడల్ పబ్లిక్ స్కూల్, సర్వోదయ విద్యాలయం సహా పలు పాఠశాలలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ బెదిరింపులతో అప్రమత్తమైన పాఠశాలల యాజమాన్యాలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సాయంతో పాఠశాలల వద్దకు చేరుకొని తనిఖీలు చేపట్టారు. ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందిని బయటకు పంపి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే, ఇప్పటి వరకూ జరిపిన తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు.
ఢిల్లీలో పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు
September 20, 2025
0
Tags