గోల్కొండ హనీట్రాప్ కేసులో నిందితుల రెండు రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లోని గోల్కొండ హనీట్రాప్ కేసులో నిందితుల రెండు రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. ప్రస్తుతం ఐదుగురు నిందితులు అమర్, మౌలాలి, రాజేశ్‌, మంజుల, రజనీరెడ్డి చంచల్‌గూడ జైలులో ఉన్నారు. వీరు బాధితుడిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో నిందితులకు రూ.50 లక్షల చెక్కులను ఇచ్చాడు. అనంతరం మరో రూ.రెండు కోట్లు ఇవ్వాలని నిందితులు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకుంటే వీడియోలను సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో హనీట్రాప్ కేసు వెలుగులోకి వచ్చింది. గోల్కొండ పోలీసులు నిందితులను కస్టడీకి తీసుకొని విచారించనున్నారు. వారి నుంచి కీలకమైన సమాచారాన్ని రాబట్టనున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు చెందిన యోగా గురువు (55) తన వ్యవసాయ భూమిలో వెల్‌నెస్‌ సెంటర్‌ నిర్మించి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జీవనశైలి వ్యాధుల బారినపడిన వారికి అక్కడే వసతి కల్పించి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. వాటిని చూసిన అమర్‌ ముఠా ఆయన్ను లక్ష్యంగా చేసుకొంది. ఆగస్టు 6న అమర్‌ రజనీరెడ్డి, మంజులను వెల్‌నెస్‌ కేంద్రానికి తీసుకెళ్లి వీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని చెప్పి అక్కడ చేర్చాడు. అనంతరం రజనీరెడ్డి వంటలో సహాయం చేస్తూ గురువుకి దగ్గరైంది. ఈ క్రమంలో ఇద్దరూ శంషాబాద్‌లోని ఓ హోటల్‌కు వెళ్లారు. ముందస్తు పథకం ప్రకారం ఆమె స్పై కెమెరా ధరించి ఆయనతో గడిపే సమయంలో రికార్డు చేసింది. సెప్టెంబర్‌ 4న ఐదుగురు ముఠా సభ్యులు గురువును కలిసి రజనీరెడ్డితో కలిసున్న వీడియోలు చూపించారు. డబ్బులు ఇవ్వాలని, లేదంటే సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తామని బెదిరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)