ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి టీడీపీలో చేరారు. వీరంతా ఇప్పటికే వైసీపీకి, ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేశారు. దీంతో ఇవాళ వీరు టీడీపీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ ఈ పరిణామం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఉండవల్లిలో వీరికి చంద్రబాబు స్వయంగా పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వనించారు. ఈ సందర్భంగా వీరి సేవల్ని తగిన రీతిలో ఉపయోగించుకుంటామని చంద్రబాబు వారికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీని వీడి టీడీపీలో చేరడం పట్ల ఎమ్మెల్సీలు సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ పదవులకు తాము సమర్పించిన రాజీనామాలకు ఇప్పటివరకు ఆమోదించలేదని ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. రాజీనామాల ఆమోదం కోసం ఆరు నెలలుగా వేచి చూశామన్నారు. రాజీనామా ఆమోదిస్తారన్న నమ్మకం లేదని వారు పేర్కొన్నారు. మండలి చైర్మన్ వెనుక ఉండి నడిపించేవారి వల్ల రాజీనామాలు ఆమోదించలేదని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ వ్యాఖ్యానించారు. సోమవారం నుంచి మండలికి వెళ్తాం. ఏం చేసుకుంటారో చేసుకోండని వైసీపీకి ఎమ్మెల్సీ మర్రి సవాల్ విసిరారు.
ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీలో చేరిక !
September 19, 2025
0
Tags