సెప్టెంబర్ 22 నుంచి రాయల్ ఎన్ ఫీల్డ్ 350 సీసీ మోడల్ రేంజ్ బైక్ లు ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలుకుఅందుబాటులోకి రానున్నాయి. బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో వినియోగదారులు ఫ్లిప్ కార్ట్ లో రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ లను కొనుగోలుచేయొచ్చు. రాయల్ ఎన్ ఫీల్డ్ తమ మోటార్ సైకిళ్లను ఆన్ లైన్ లో అందించడం ఇదే మొదటిసారి. బుల్లెట్ 350, క్లాసిక్ 350, హంటర్ 350, గోవా క్లాసిక్ 350, న్యూ మెటియోర్ 350 వంటి మోడళ్లను ఫ్లిప్ కార్ట్ ద్వారా విక్రయించాలని కంపెనీ యోచిస్తోంది. బెంగళూరు, గురుగ్రామ్, కోల్ కతా, లక్నో, ముంబైలలో ఉన్న కస్టమర్లు పూర్తి జీఎస్టీ ప్రయోజనాలతో పాటు వివిధ సౌకర్యవంతమైన చెల్లింపు ఎంపికలను ఉపయోగించి ఆర్డర్లు ఇవ్వవచ్చు. తమకు నచ్చిన మోడల్ బైక్ లను కొనుగోలు చేయవచ్చు.
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు !
September 19, 2025
0
Tags