పొదుపు+ బీమాతో పాటు గ్యారెంటీ రిటర్న్స్‌తో ఎల్‌ఐసీ జీవన్‌ ఉత్సవ్‌

Telugu Lo Computer
0


న్వెస్ట్‌ చేస్తే పొదుపు+ బీమాతో పాటు గ్యారెంటీ రిటర్న్స్‌తో ఎల్‌ఐసీ జీవన్‌ ఉత్సవ్‌ పాలసీని తీసుకొచ్చింది. ఇదో నాన్‌ లింక్డ్‌, నాన్‌ పార్టిసిపేటింగ్‌, ఇండివిడ్యువల్‌, సేవింగ్స్‌, జీవితాంతం బీమా అందించే పాలసీ. ఒకసారి ఈ పాలసీ తీసుకుంటే.. ప్రీమియం చెల్లింపు వ్యవధి ముగిసిన తర్వాత జీవితాంతం ఆదాయం పొందవచ్చు. జీవన్ ఉత్సవ్ అనేది నాన్-లింక్డ్ మరియు నాన్-పార్టిసిపేటింగ్ జీవిత బీమా పాలసీ. నాన్-లింక్డ్ అంటే అది అందించే రాబడి ఇతర మార్కెట్ల రాబడిపై ఆధారపడి ఉండదు. ఇది పాలసీలో పేర్కొన్న స్థిరమైన రాబడిని అందిస్తుంది. జీవన్ ఉత్సవ్ బీమా పథకాలు 90 రోజుల శిశువు నుండి 65 సంవత్సరాల వయస్సు గల సీనియర్ సిటిజన్ వరకు ఎవరికైనా అందుబాటులో ఉన్నాయి. కనీస బీమా మొత్తం (బేసిక్ సమ్ అష్యూర్డ్) రూ. 5 లక్షలు. జీవన్ ఉత్సవ్ ప్రీమియం చెల్లింపు వార్షికం, కనీసం 5 సంవత్సరాల కాలపరిమితి. గరిష్ట కాలపరిమితి 15 సంవత్సరాలు. ఈ పాలసీలో కనీస బీమా మొత్తం రూ. 5,00,000. మీరు కావాలనుకుంటే ఎక్కువ బీమా మొత్తాన్ని ఎంచుకోవచ్చు. మీరు కనీసం రూ. 5 లక్షల బీమా మొత్తంతో పాలసీని ఎంచుకుంటే, అలాగే ఐదు సంవత్సరాల ప్రీమియం ఎంపికను ఎంచుకుంటే సంవత్సరానికి రూ. 1.16 లక్షలు చెల్లించాలి. ఐదు సంవత్సరాలలో దాదాపు రూ. 5.80 లక్షలు చెల్లించి చెల్లిస్తారు. దీని తరువాత ఐదు సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ సమయంలో ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఐదు సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ తర్వాత సంవత్సరానికి రూ. 50,000 చెల్లింపు కొనసాగుతుంది. జీవితాంతం ప్రతి సంవత్సరం రూ. 50,000 ఆదాయం కొనసాగుతుంది. ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే నామినీలకు రూ. 5 లక్షల పరిహారం లభిస్తుంది. అధిక చెల్లింపు కోరుకుంటే వారు ఎక్కువ ప్రీమియం చెల్లించాలి. ఉదాహరణకు సంవత్సరానికి రూ. 5 లక్షల ఆదాయం పొందాలనుకుంటే రూ. 50 లక్షల ప్రాథమిక బీమా మొత్తంతో ఒక పథకాన్ని ఎంచుకోవచ్చు. అప్పుడు 5 సంవత్సరాల పాటు సంవత్సరానికి దాదాపు రూ. 11 లక్షల ప్రీమియం చెల్లించాలి. అదే సమ్ అష్యూర్డ్ రూ.18 లక్షలు ఉండేలా ప్రీమియం చెల్లించినట్లయితే ఏడాదికి లక్షా ఎనభై వేలు అందుతాయి. దీని ప్రకారం నెలకు రూ.15 వేలు చేతికి వస్తాయి. ఇలా 100 సంవత్సరాలు వచ్చే వరకు అందుతాయి. ఎల్‌ఐసీ జీవన్‌ ఉత్సవ్‌ పాలసీని ఎల్‌ఐసీ ఏజెంట్‌ ద్వారా గానీ, ఆన్‌లైన్‌లో గానీ కొనుగోలు చేయవచ్చు. ఈ పాలసీపై రుణ సదుపాయం కూడా ఉంది. పాలసీ చెల్లింపు సమయంలోనూ, ఆదాయం మొదలైన తర్వాత కూడా రుణం తీసుకోవచ్చు. అయితే, అప్పుపై చెల్లించే వడ్డీ, రెగ్యులర్‌ ఆదాయంలో 50 శాతం మించకూడదు.

Post a Comment

0Comments

Post a Comment (0)