ఐక్యూ 15 ప్రీ-బుకింగ్స్ ప్రారంభం !

Telugu Lo Computer
0


చైనాలో ఐక్యూ 15 వచ్చే నెలలో అధికారికంగా విడుదల కానుంది. ఈ లాంచ్‌కి ముందే స్మార్ట్‌ఫోన్‌కు ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అంతేకాకుండా కంపెనీ తన అధికారిక టీజర్ ద్వారా ఫోన్ డిజైన్‌ను కూడా విడుదల చేసింది. ఐక్యూ 15 డిజైన్ లో వెనుక భాగాన పెద్ద సర్క్యులర్ కెమెరా ఐలాండ్ కనిపిస్తోంది. ఇందులో సెన్సార్లు అమర్చబడ్డాయి. ప్రత్యేకంగా ఈ కెమెరా రింగ్ అర్జీబీ  లైట్స్‌తో ప్రకాశించేలా డిజైన్ చేశారు. ఇది ఫోన్‌కు అదనపు ఆకర్షణను ఇస్తుంది. ఫోన్ బ్యాక్‌ప్యానెల్ స్పేస్‌షిప్‌లా కనిపించేలా డిజైన్ చేశారు. ఫోన్ కుడి వైపు ఫ్రేమ్‌లో మెటల్ మిడిల్ ఫ్రేమ్, చక్కటి ఫినిషింగ్‌తో ఉన్న బటన్ కనిపిస్తోంది. టిప్‌స్టర్ సమాచారం మేరకు ఐక్యూ 15లో అప్‌గ్రేడ్ అయిన 50MP 3X పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. దీనివల్ల కెమెరా ఐలాండ్ కొంచెం మందంగా కనిపిస్తుంది. అలాగే, బ్యాక్ ప్యానెల్‌లో హిడెన్ RGB లైట్ కూడా ఉంటుంది. మరో లీక్ ప్రకారం, ఐక్యూ 15లో కలర్ చేంజింగ్ ప్యానెల్ ఉండనుంది. ఇది యాంగిల్ ఆధారంగా గ్రే నుండి పింక్‌కి షేడ్ మారుతుంది. V2505A మోడల్ నెంబర్‌తో ఒక హ్యాండ్‌సెట్ బెంచ్‌మార్క్ ప్లాట్‌ఫామ్‌లో కనిపించింది. ఇది ఆండ్రాయిడ్ 15పై 12GB ర్యామ్ తో రన్ అవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)