భారత క్రికెట్ నియంత్రణ మండలి వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు జట్టును ప్రకటించింది. శుబ్‌మన్ గిల్ సారథ్యంలో పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను గురువారం వెల్లడించింది. స్వదేశంలో జరిగే ఈ సిరీస్‌కు సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ ఆడిన జట్టులో స్వల్ప మార్పులతోనే భారత్ విండీస్‌తో బరిలో దిగనుంది. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ గాయం నుంచి ఇంకా కోలుకోని కారణంగా వెస్టిండీస్‌తో సిరీస్‌కు దూరం కాగా, ఇంగ్లండ్ పర్యటనలో వరుస వైఫల్యాలు చవిచూసిన కరుణ్ నాయర్‌పై వేటు పడింది. వికెట్ కీపర్లుగా ధ్రువ్ జురెల్‌తో పాటు తమిళనాడు ప్లేయర్ నారాయణ్ జగదీశన్ జట్టుకు ఎంపికయ్యాడు. శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి, నారాయణ్ జగదీశన్ (వికెట్ కీపర్), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్.
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు టీమిండియా జట్టు ప్రకటన
September 25, 2025
0
Tags