చంఢీఘడ్ లో రక్షణమంత్రి రాజ్ నాధ్ సింగ్ సమక్షంలో రేపు జరిగే ఓ కార్యక్రమంలో మిగ్ 21లకు ఘన వీడ్కోలు పలకనున్నారు. ప్రస్తుతం మిగ్ 21 పాంథర్స్ గా పిలిచే చివరి తరం 23వ నంబర్ స్క్రాడ్రన్ వెర్షన్ విమానాలను ఎయిర్ ఫోర్స్ వాడుతోంది. వీటికి రేపు ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ 'బాదల్ 3' అనే కాల్ సైన్‌తో చివరిగా ఎగురవేస్తారు. ఈ కార్యక్రమంలో స్క్ర్వాడ్రన్ లీడర్ ప్రియాశర్మ కీలకంగా వ్యవహరించనున్నారు. ఆమె నిన్న మిగ్ 21 రిహార్సల్స్ లో పాల్గొన్నారు. రేపు జరిగే వీడ్కోలు కార్యక్రమంలోనూ ఆమె మిగ్ 21 విమానంలో విహరించబోతున్నారు. రేపు జరిగే మిగ్ 21 వీడ్కోలు కార్యక్రమంలో 23వ నంబర్ స్క్వాడ్రన్‌కు చెందిన ఆరు జెట్‌లు ల్యాండింగ్ అయిన తర్వాత వాటర్ ఫిరంగులతో సెల్యూట్ అందుకుంటాయి. ఈ చారిత్రాత్మక క్షణంలో ప్రియ శర్మ కీలక పాత్ర పోషించనున్నారు. దుండిగల్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీ నుండి 2018లో గ్రాడ్యుయేట్ అయిన ప్రియ శర్మ, భారత వైమానిక దళంలో ఏడవ మహిళా ఫైటర్ పైలట్. గతంలో ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ నుండి ఆమె గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ పొందారు. అనంతరం ఫ్లయింగ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు.
మిగ్ 21లకు ఘన వీడ్కోలు పలకనున్న ఎయిర్ ఫోర్స్
September 25, 2025
0
Tags