రష్యా సాయంతో ఏకే-203 రైఫిల్స్‌ ఉత్పత్తి : ట్రేడ్‌షోలో ప్రధాని మోడీ

Telugu Lo Computer
0


త్తర ప్రదేశ్‌లోని గౌతమ్‌ బుద్ధానగర్‌లో మొదలైన ట్రేడ్‌షోలో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఈ వాణిజ్య ప్రదర్శనకు కూడా మాస్కో భాగస్వామిగా వ్యవహరిస్తోందన్నారు. దేశ స్వయంసమృద్ధిలో ఉత్తరప్రదేశ్‌ పాత్రను ఆయన కొనియాడారు. భారత్‌లో తయారయ్యే మొబైల్‌ ఫోన్లలో అత్యధికం ఇక్కడి నుంచే వస్తున్నాయన్నారు. సెమీకండక్టర్‌ రంగంలోను భారత్‌ స్వయంసమృద్ధి సాధించాలని పేర్కొన్నారు. భారత్‌లోనే చిప్‌ నుంచి షిప్‌ వరకు అన్నీ తయారు చేయాలని తాము కోరుకుంటున్నట్లు వెల్లడించారు. పన్నుల తగ్గింపు కొనసాగుతుందన్నారు. భారత్‌లో తయారయ్యే మొబైల్‌ ఫోన్లలో 55 శాతం యూపీ నుంచే వస్తున్నాయి. సెమీకండక్టర్‌ రంగంలో కూడా ఈ రాష్ట్రం బలోపేతమైంది. ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గించుకోవాలని మన దళాలు భావిస్తున్నాయి. మనం బలమైన రక్షణ రంగాన్ని అభివృద్ధి చేసుకొంటున్నాం. రష్యా సాయంతో ఇక్కడ ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీలో ఏకే-203 రైఫిల్స్‌ ఉత్పత్తి మొదలుపెడతాము. యూపీలో డిఫెన్స్‌ కారిడార్‌ను నిర్మిస్తున్నామన్నారు. జీఎస్టీలో మార్పులు నిర్మాణాత్మక సంస్కరణలు. అవి భారత వృద్ధికి రెక్కలు తొడుగుతాయి. జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ సరళంగా మారింది. పన్ను వివాదాలు గణనీయంగా తగ్గాయి. ఎంఎస్‌ఎంఈలకు వేగంగా రీఫండ్స్‌ లభిస్తున్నాయి. 2014 ముందు కాంగ్రెస్‌ పార్టీ వైఫల్యాలను దాచిపెట్టేందుకు.. దాని మిత్రులు ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారు. మేము ప్రజల ఆదాయం, పొదుపు పెంచాము. ఇక్కడితోనే ఆగిపోం. మన ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయడాన్ని కొనసాగిస్తాం. భవిష్యత్తులో కూడా పన్నులు తగ్గిస్తాము. జీఎస్టీ సంస్కరణల ప్రక్రియ కొనసాగుతుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)