రూ.60 కోట్ల చీటింగ్‌ కేసులో రాజ్‌ కుంద్రాకు సమన్లు !

Telugu Lo Computer
0


వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మేరకు మోసం చేసిన కేసులో రాజ్‌ కుంద్రాకు ముంబయి ఆర్థిక నేరాల విభాగం అధికారులు సమన్లు జారీ చేశారు. సెప్టెంబరు 15న ఈ కేసు విచారణకు హాజరుకావాలని రాజ్‌కు అధికారులు సూచించారు. కేసుకు సంబంధించి నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ఆడిటర్‌కు కూడా సమన్లు జారీ అయ్యాయి. పెట్టుబడి ఒప్పందానికి సంబంధించి రూ.60 కోట్లు మోసం చేశారని శిల్పాశెట్టి, రాజ్‌ కుంద్రాలపై దీపక్‌ కొఠారి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు జుహు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ జరుగుతుండగా శిల్పా దంపతులు తరచూ విదేశీ పర్యటనలకు వెళ్తున్న నేపథ్యంలో అధికారులు ఇటీవల వారికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)