ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలకు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు  దసరా పండుగ సెలవులు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 ఉండనున్నాయి. సెలవుల అనంతరం పాఠశాలలు అక్టోబర్ 3న తెరుచుకోనున్నాయి. విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్‌ ప్రకారం.. జూనియర్ కాలేజీలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు ఉంటాయి. క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు మాత్రం సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఇస్తారు. వీరికి మొత్తం 6 రోజులు దసరా సెలవులు ఉంటాయి. గతేడాదితో పోల్చితే ఈసారి దసరా ముందుగానే వచ్చింది. గతేడాదిలో దసరా పండగ అక్టోబర్ 12వ తేదీ రాగా, ఈసారి మాత్రం అక్టోబర్ 2వ తేదీనే వచ్చింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)