రన్యా రావుకు రూ.270 కోట్ల పెనాల్టీ విధిస్తూ జైల్లోనే నోటీసులు అందించిన డీఆర్ఐ అధికారులు

Telugu Lo Computer
0


బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యారావుకు ది డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా రూ.102.55 కోట్ల జరిమానా విధించారు. ఆమెతో సహా నలుగురు నిందితులకు మొత్తంగా రూ.270 కోట్ల పెనాల్టీ విధిస్తూ జైల్లోనే నోటీసులు ఇచ్చారు. ఒకవేళ ఆ మొత్తాన్ని చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేస్తామని డీఆర్ఐఅధికారులు హెచ్చరించారు. దుబాయ్‌ నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ మార్చి తొలి వారంలో రన్యారావు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆమె నుంచి 14.3 కిలోల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకొని అరెస్టు చేశారు. నిందితులకు ఏడాది పాటు జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్‌ నిరోధక చట్టం కింద ఆమెకు కోర్టు ఏడాది జైలు శిక్షను ఖరారు చేసింది. ఆమెతోపాటు సహచరుడు తరుణ్‌ కొండూరు రాజు, బంగారం వ్యాపారి సాహిల్‌ జైన్‌లకూ శిక్ష పడింది.


Post a Comment

0Comments

Post a Comment (0)