తెలంగాణకు మరో వారం రోజుల్లో 27 వేల మెట్రిక్ టన్నుల యూరియా

Telugu Lo Computer
0


తెలంగాణకు నిన్న ఒక్కరోజే తెలంగాణకు తొమ్మిది వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇవాళ మరో 5 వేల మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందని పేర్కొన్నారు. మరో వారం రోజుల్లో 27 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కానుందని, సరఫరాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని వెల్లడించారు. ఐదు రోజుల్లో పంట నష్టంపై సర్వే పూర్తి చేయాలని తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణలోని వరద బాధితులకు నష్టపరిహారం పెంచారు. ఈ మేరకు తెలంగాణలో వరద బాధితులకు నష్టపరిహారం విడుదల చేసారు. రూ 1.30 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం ఈ మేరకు జీవో జారీ చేసారు. వరదల్లో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)